తిరువనంతపురం నుంచి ప్రశాంతి నిలయానికి రైళ్లు

తిరువనంతపురం నుంచి ప్రశాంతి నిలయానికి రైళ్లు

సత్యసాయి శతజయంతి వేడుకల కోసం తిరువనంతపురం నార్త్ నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. 06093 రైలు 19, 21 తేదీల్లో సాయంత్రం 6:05కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:00కు ప్రశాంతి నిలయం చేరుతుంది. 06094 రైలు తిరుగు పయనంలో 20, 22 తేదీల్లో రా.9:00కు బయలుదేరుతుంది. ఈరైళ్లు 21 బోగీలతో నడుస్తాయి.