డబ్బా సర్పంచ్ వినూత్న ప్రయత్నం

డబ్బా సర్పంచ్ వినూత్న ప్రయత్నం

ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ సర్పంచ్ సంతోష్ డోంగ్రి గ్రామసభలకు గ్రామస్థులను వినూత్నంగా ఆహ్వానించారు. బుధవారం ఇంటింటికీ గ్రామ-సభ ఆహ్వాన లేఖ పేరుతో వినూత్న పద్ధతిలో గ్రామ సభకు అధిక జన సమూహాన్ని కూడగట్టేందుకు ప్రయత్నం చేశారు. గ్రామ-సభకు ప్రతీ ఒక్కరూ సకాలంలో హాజరై అందరీ సలహాలు, సూచనలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించాలని కోరారు.