నరసాపురం గ్రామంలో చోరీ

ATP: బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామంలో తిమ్మారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూలేని సమయంలో దొంగలు చొరబడి బీరువాలో దాచి ఉంచిన రూ.1,50,000ల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై శుక్రవారం సాయంత్రం బాధితుడు తిమ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.