కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్న కమిషనర్
CTR: వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానాన్ని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) కమిషనర్ ఎన్. తేజ్ భరత్ దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.