ఇన్‌స్టాలో పరిచయం.. బాలిక గర్భవతి
KKD: ఇన్‌స్టా వేదికగా ఏర్పడిన పరిచయం పిఠాపురానికి చెందిన ఓ బాలిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. గెద్దనాపల్లికి చెందిన సూర్యచందు(19) ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, గర్భవతిని చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చెన్నైలో కట్టర్‌గా పనిచేసే నిందితుడు, తరుచూ వచ్చి బాలికను కలిసేవాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.