'యూనివర్సిటీ ప్రతిష్ఠ పెంచేలా ఉండాలి'
SKLM: జిల్లా ఓబీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా డా. బీఆర్ఎయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. సిహెచ్ రాజశేఖర రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ రజని, రిజిస్ట్రార్ ఆచార్య బి. అడ్డయ్య గురువారం ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ పదవి ద్వారా భవిష్యత్‌లో చేపట్టే సేవా, సంక్షేమ కార్యక్రమాలు యూనివర్సిటీ ప్రతిష్ట పెంచేలా ఉండాలన్నారు.