బసంతాపురానికి ఐకేపీ కేంద్రం మంజూరు
BHNG: రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామానికి నూతనంగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరైంది. గత కొన్నేళ్లుగా కేంద్రం లేక రైతులు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ మెండు రత్నమాల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి, ఐకేపీ సెంటర్ మంజూరు చేయించారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.