కొబ్బరి ధర పతనం... నష్టాల బాటలో వ్యాపారులు
కోనసీమ: జిల్లాలో కొబ్బరి ధర రోజురోజుకీ పతనం అవుతుంది. నెల క్రితం రూ.26 ఉన్న ఒక్కొక్క కాయ ధర ప్రస్తుతం రూ.14 కు చేరింది అని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఆగిపోవడం వలన ధర పతనం అయిందని అంటున్నారు. దీంతో వ్యాపారులు నిల్వ ఉంచిన కొబ్బరి కాయ నష్టాలకు అమ్ముకోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.