బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన
KRNL: తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డి హైస్కూల్‌లో శుక్రవారం ‘బాల్య వివాహాల ముక్త్ భారత్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 ఏళ్ల లోపు వివాహం చట్టరీత్యా నేరమని, అలాంటి వివాహాల వల్ల కలిగే సమస్యలను విద్యార్థినులకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అంబికా త్రివేణి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజని, మహిళా పోలీస్ శాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.