కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి పరుగులు: ఎమ్మెల్యే

కోనసీమ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం రావులపాలెం మండలంలోని పలు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదనపు తరగతి గదులు తదితర కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.