పెద్దవంగర నూతన ఎస్సైగా ప్రమోద్ కుమార్ గౌడ్
MHBD: పెద్దవంగర మండల నూతన ఎస్సైగా సి.ప్రమోద్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై క్రాంతి కిరణ్ బదిలీపై కేసముద్రం వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.