కీలక చట్టానికి కెనడా పార్లమెంట్ ఆమోదం
కెనడా పార్లమెంట్ కీలకమైన కాంబాటింగ్ హేట్ చట్టానికి ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా కెనడాలోని భారతీయులు ఎదురు చూస్తున్న ఈ బిల్లుకు ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ చట్టం ద్వారా ఇకపై ప్రార్థనా స్థలాలపై దాడులు, ఖలిస్తానీల బహిరంగ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చట్టం త్వరగా కార్యరూపం దాల్చాలని భారతీయులు కోరుతున్నారు.