సోమందేపల్లిలో దొంగ.. పట్టుకున్న స్థానికులు

సోమందేపల్లిలో దొంగ.. పట్టుకున్న స్థానికులు

సత్యసాయి: సోమందేపల్లి దుర్గా నగర్‌లో దొంగతనానికి ప్రయత్నించిన హరికృష్ణ అనే వ్యక్తిని స్థానికుడు గోపాల్ చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున రంగన శ్రీనివాసులు ఇంట్లోకి నిందితుడు చొరబడగా, నీళ్ల కోసం లేచిన గోపాల్ అతడిని గమనించారు. దొంగను పట్టుకొనే క్రమంలో కత్తెర, బ్లేడుతో దాడికి యత్నించినా ప్రాణాలకు తెగించి బంధించి పోలీసులకు అప్పగించారు.