హాలహర్విలో ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

హాలహర్విలో ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

KRNL: హాలహర్వి మండలం మారెమ్మ గుడి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రహారం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్, ఆదోని ఎస్‌కేడీ కాలనీకి చెందిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.