FCI గోధాములను తనిఖీ చేసిన తహసీల్దార్

FCI గోధాములను తనిఖీ చేసిన తహసీల్దార్

కాకినాడ జిల్లా తుని మండలం రేఖవాణిపాలెం, చేపూరులోని FCI గోధాములను తహసీల్దార్ ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత, ప్యాకింగ్ విధానాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి, నిల్వల్లో తేడాలు ఉండకూడదని ఆదేశించారు.