దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
VZM: విజయనగరం మండలం, కొండకరకాం గ్రామంలో దెబ్బతిన్న వరి పంట పొలాలను శుక్రవారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.