వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురం మున్సిపల్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ను స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, చైర్మన్ రెడ్డి నాగేంద్ర మణి, మున్సిపల్ కమిషనర్ నిర్మల కుమార్, తదితరులు పాల్గొన్నారు.