నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మండలాల్లో నూతన కార్యాలయ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు. రేవల్లి మండలంలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఒక్కో భవనం రూ.32 లక్షలను కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం మండల తహసీల్దార్‌కు బాధ్యతను అప్పగించారు.