చంద్రబాబుకు అవార్డు పట్ల ఎమ్మెల్యే హర్షం
WG: ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణమని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్తుండటం అభినందనీయమని అన్నారు.