'నిషాన్ ఘాట్ కాలనీవాసులకు మౌలిక వసతులు కల్పించాలి'
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని నిషాన్ ఘాట్ కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ కార్యవర్గ సభ్యులు మేస్రం భాస్కర్ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇళ్ల స్థలాలకు పట్టాలు, కరెంటు సౌకర్యం, రోడ్డు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.