'చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవాలి'
KDP: కాగ్ నివేదికలో ఇచ్చిన అక్షింతలతోనైనా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కళ్లు తెరచుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని మాజీ MP తులసి రెడ్డి సూచించారు. వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. 2024-25కు సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదిక రాష్ట్రానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ఆర్థిక స్థిరత్వం క్షీణిస్తోందని, భవిష్యత్తు గడ్డు కాలంగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోందన్నారు.