పుత్తూరు నూతన కమిషనర్‌గా నాగేశ్వరరావు
TPT: పుత్తూరు నూతన కమిషనర్‌గా డీవీ నాగేశ్వరరావు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిపై అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం స్థానిక అధికారులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.