'తల్లిదండ్రుల సంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి'
NLR: జిల్లాలో తల్లిదండ్రుల సంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి తెలిపారు. కావలి ఆర్‌డీవో ఆఫీస్‌లో డివిజన్ స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం అందజేశారు. తల్లిదండ్రుల ఆస్తులను కావాలనుకుంటున్న పిల్లలు వారిని మాత్రం బయటకు గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.