నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

TPT: తిరుపతి జిల్లాలో రేపు (ఆదివారం) జరిగే నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. జిల్లాలో మొత్తం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో తిరుపతిలో 9 కేంద్రాలు, గూడూరులో ఒక కేంద్రం ఉన్నాయని పేర్కొన్నారు.