సత్యసాయితో జ్ఞాపకాలు.. గుర్తుచేసుకున్న మోదీ
AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. ఈ క్రమంలో బాబాతో ఉన్న సంబంధాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 'సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు తనకు వివిధ అవకాశాలు లభించాయి' అని పేర్కొన్నారు.