VIDEO: పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ 30వ వార్డులో నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ నగదును ఎమ్మెల్యే రాము శనివారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు.