కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి: బీజేపీ చీఫ్
TG: రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడ ఉందని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఎద్దేవా చేశారు. 'ఆరు డిక్లరేషన్లలో ఎన్ని అమలు చేశారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. రెండేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డు విడుదల చేయాలి. HILT పాలసీపై పోరాడుతున్నాం. మాటలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ఈ నెల 7న TBJP మహాధర్నా చేస్తుంది' అని తెలిపారు.