స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ.. అందరూ ఆహ్వానితులే: హోంమంత్రి
AP: రాష్ట్ర ప్రజలనుద్దేశించి హోంమంత్రి అనిత Xలో వీడియో సందేశం విడుదల చేశారు. 'నక్కపల్లి తీరంలో పారిశ్రామిక విప్లవానికి వేళయింది. దిగ్గజ సంస్థ 'ఆర్సెలార్ మిట్టల్ - నిప్పన్ స్టీల్' భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ నెల 23న భూమి పూజ జరగనుంది. తప్పనిసరిగా అందరూ హాజరై పాయకరావుపేట పారిశ్రామికాభివృద్ధిలో చారిత్రక ఘట్టాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు.