ఎంపీపీ పాఠశాలల్లో తనిఖీ చేసిన MEO

ఎంపీపీ పాఠశాలల్లో తనిఖీ చేసిన MEO

KRNL: వెల్దుర్తి మండలంలోని లింగాలపల్లె, సిద్ధనగట్టు ఎంపీపీ పాఠశాలలను ఎంఈఓ ఇందిరా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల హాజరు శాతం, బోధన విధానాలు, తరగతి గదుల్లోని పాఠ్య కార్యక్రమాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.