క్రికెట్ స్టేడియం స్థలాన్ని పరిశీలించిన సానా సతీశ్
KKD: సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 16.55 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ స్థలాన్ని గురువారం సాయంత్రం ఎంపీ, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్ పరిశీలించారు. స్టేడియం ఏర్పాటుతో సర్పవరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస్ ఎంపీకి స్థల వివరాలను వివరించారు.