డెంగ్యూ జ్వరంతో ఓ చిన్నారి మృతి

డెంగ్యూ జ్వరంతో ఓ చిన్నారి మృతి

SRCL: డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇంద్రనగర్‌కు చెందిన సారుగు బాలయ్య–సంధ్య దంపతుల కుమార్తె సహస్ర(8) మూడు రోజుల క్రితం అనారోగ్యంతో సిరిసిల్లలోని ఆస్పత్రిలో చేరగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ డెంగ్యూ నిర్ధారణ కాగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.