'అందరికీ నిత్యవసర సరుకులు ఇవ్వాలి'
AKP: మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉపాధి లేక అవస్థలు పడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి దేవుడు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాంబిల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మత్స్యకారులకు ఇచ్చినట్లుగా.. 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అన్ని కుటుంబాలకు ఇవ్వాలని సూచించారు.