వందేళ్లు దాటినా కష్టాలే.. పింఛన్ కోసం వృద్ధుడి ఆవేదన
GNTR: తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఒకప్పుడు యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.