ఉద్యోగాల పేరుతో మోసపోకండి: ఎస్పీ

KRNL: ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని, పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.