ప్రతిరోజు త్రాగునీరు అందించాలని సీఐటీయూ వినతి

ప్రతిరోజు త్రాగునీరు అందించాలని  సీఐటీయూ వినతి

NTR: నందిగామ పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా ప్రతిరోజు తాగునీరు అందించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు అర్జీ సమర్పించారు. 20 వార్డుల్లో పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయు కార్యదర్శి కె. గోపాల్ తెలిపారు. అనాసాగరం గ్రామంలోని కొత్త వాటర్ ట్యాంక్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.