జాతీయ రహదారిపై పోలీసుల వాహన తనిఖీలు

జాతీయ రహదారిపై పోలీసుల వాహన తనిఖీలు

SRPT: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, పత్రాలు లేని వాహనాలపై నిఘా పెట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ప్రజా భద్రత కోసమే ఈ తనిఖీలని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఎస్ఐ సూచించారు.