BC స్టడీ సర్కిల్ నుంచి 51 మందికి ఉద్యోగాలు

ఆదిలాబాద్: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొంది మొత్తం 51 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కే. రాజలింగు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో 34 మంది ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలను 17 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలను సాధించినట్లు తెలిపారు.