నేడు భారీ తిరంగా ర్యాలీ

నేడు భారీ తిరంగా ర్యాలీ

AP: ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలో 5 వేల మందితో భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు ముఖ్యనేతలు హాజరుకానున్నారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా విద్యార్థులు గీతాలు ఆలపిస్తారు.