కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS నేతలు
JN: దేవరుప్పుల మండలం సీత్య తండాలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గ్రామానికి చెందిన 25 మంది బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నేతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు.