గుర్రంపల్లిలో మత్తు పదార్థాలపై అవగాహన

గుర్రంపల్లిలో మత్తు పదార్థాలపై అవగాహన

PDPL: పెద్దపల్లి మండలం గుర్రంపల్లిలో మత్తు పదార్థాల నిర్మూలనపై నషా ముక్త్ భారత్ కమ్యూనిటీ సిబ్బంది ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను డ్రగ్స్, గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్ అమ్మకాల గురించి తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబరు 14446కు సమాచారం అందించాలని కోరారు.