గుర్తు తెలియని మృతదేహం లభ్యం
W.G: తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.