జిల్లాలో కలకలం రేపిన స్క్రబ్ టైఫస్ వ్యాధి

జిల్లాలో కలకలం రేపిన స్క్రబ్ టైఫస్ వ్యాధి

SKLM: లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇటీవల కాలంలో తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా... ఏదో ఒక పురుగు కుట్టింది. దీంతో ఆ రైతుకు జ్వరం రాగా వైద్యులకు సంప్రదించాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ వ్యాధిగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.