మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి: పవన్

AP: బంగాళాఖాతంలో మత్స్యకారుల ఘర్షణలపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు. 'భారత్-శ్రీలంక మత్స్యకారుల మధ్య ఘర్షణలతో నాగపట్నం జాలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది వారి జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ఈ సమస్యను పరిష్కరించాలని విదేశాంగ శాఖను కోరుతున్నా. నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని పేర్కొన్నారు.