దొంతికి మంత్రి పదవి ఇవ్వాలని మొకాళ్లపై మొక్కు

WGL: గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ ఆయన అభిమానులు గుడి మెట్లపై మోకాళ్లపై నడిచి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకొండ రవి వర్మ, బండారి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ పాల్గొన్నారు.