కమిన్స్‌పై మాజీ క్రికెటర్ ప్రశంసలు

SRH కెప్టెన్ కమిన్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'షమీ బదులుగా పాట్ కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేయడం SRHకు కలిసొచ్చింది. ప్రత్యర్థి జట్టును షమీ కంటే కమిన్సే ఎక్కువ బయపెట్టాడు. వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి, DCని హడలెత్తించాడు. రైట్ ఏరియాలో బంతులను సంధించి పవర్ ప్లేలో వికెట్లు సాధించాడు' అని కొనియాడాడు.