'వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి'

KMM: కూసుమంచి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లే రహదారిపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి రహదారి బురదమయంగా మారుతోందని వాపోతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి రహదారిపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.