పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయండి: ఎస్పీ
PLD: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం నాదెండ్ల పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సచివాలయ పోలీసుల సహకారంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని సూచించారు.