మేధావులు వచ్చి వారి పరిస్థితిని చూడండి: కవిత
HYD: మేధావులుగా పిలవబడే ప్రొ.కోదండరాం, ప్రొ.హరగోపాల్ వంటి వారు ఖమ్మం వచ్చి పేదవారి పరిస్థితిని చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితిని చూసిన తర్వాత ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలన్నారు. వెలుగుమట్ల బాధితులకు సంపూర్ణంగా న్యాయం జరిగే వరకూ వారి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు.