కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే

MBNR: హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బైకని యాదయ్య గత నెల ప్రమాదవశాత్తూ మేస్త్రీ పని చేస్తుండగా గోవా కట్టెలు విరిగి క్రింద పడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరేపల్లి సురేందర్ రెడ్డి కలిసి బైకని యాదయ్య ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు.