'పేదలకు లక్షలాది రూపాయల లబ్ధి'

VZM: వైసీపీ హయాంలో పేదలకు సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది రూపాయల లబ్ధి చేకూరిందని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. జరజాపుపేటలో ఆదివారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. బడ్డుకొండ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో స్థానికులని కాదని ఎన్ఆర్ఐని ఎమ్మెల్యేగా గెలిపించారని ఆమె హైటెక్ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.